– ఓట్ల అధికారమే ఆ రెండు పార్టీలకు పరమావధి
– అధికారంలోకి రాగానే ఏడూ మండలాలతో సహా 500 వాట్ల విద్యుత్‌కేంద్రాన్ని ఆంధ్రకు అప్ప గించిన మోడీ
– సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు
– మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు బిజేపి లు చేసే రెండు జపాలు కుడా ప్రజల కోసం కాదని అధికారమే పరమావదిగా పెట్టుకుని జపాలకు పూను కున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల పై బిజెపి, కాంగ్రెస్ ల ధోరణిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బి ఆర్ ఎస్ పార్టీ తో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సావాలను రాజకీయం చేయ జూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని మంత్రి జగదీష్ రెడ్డి ఘటుగా ప్రశ్నించారు.అధికారం లోకి వచ్చిందే తడవుగా 500 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా ఏడూ మండలలాలను ఆంధ్రలో కలిపిన బిజెపి పార్టీకీ తెలంగాణా గురుంచి మాట్లాడే హక్కు ఏక్కడదంటూ ఆయన నిలదీశారు. ఏడూ దశాబ్దాలుగా తెలంగాణను ఘాదందకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దిఉత్సావాల గురుంచి మాట్లాడడం విడ్డురంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉత్సావాల గురించి మాట్లాడఫడం హాస్పాస్పదంగా ఉందన్నారు. తొమ్మిదేండ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాధించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యమై బీఆర్ ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. వరిదిగుబడిలో సాధించిన విజయాలు రాష్ట్ర సీఎం కేసీఆర్ సాధించిన విజయాలను తార్కాణమని స్పష్టం చేశారు.