ఐఎఫ్టియుల విలీన సభను జయప్రదం చేయండి…

నవతెలంగాణ – నూతనకల్
ఈ నెల 18న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే బావసారూప్యత  కలిగిన రెండు విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్ టి యు లు విలీనం సభను జయప్రదం చేయాలని  ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు శుక్రవారం మండల కేంద్రంలో విలీన సభకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు ,,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మేధావులు విప్లవ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు సభ కు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు మున్నా  అశోక్, ఐ ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు మూరగుండ్ల మధు, హమాలి యూనియన్ నాయకులు రవి శ్రీను వెంకన్న, దేవేందర్, మురళి ఆటో యూనియన్ నాయకులు పులుసు రవి, బాకీ సందీప్,పులుసు మహేష్ , మీర్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు