జన జాతర బహిరంగ సభను జయప్రదం చేయండి..

Make the Jana Jatara public meeting a success.– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈనెల 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా 3వ మహాసభల సందర్భంగా 15వ తేదీన నిర్వహిస్తున్న ” జన జాతర బహిరంగ సభను ” ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చినారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ ” పోస్టర్ ” ను ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా అంజయ్య హాజరై , మాట్లాడుతూ సీపీఐ(ఎం) నిరంతరం కార్మిక కర్షక వ్యవసాయ కూలీల వృత్తిదారుల సమస్యలపైన అనేక ఉద్యమాలు నిర్వహించి వారి హక్కుల కోసం వారికి అండగా నిలిచిందని అన్నారు. చీమల కొండూరు ప్రాంతంలో సాగునీరు లేక రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రధాన పంట అయిన పత్తిని పండిస్తే మద్దతు ధర మార్కెట్ లేక పెట్టిన పెట్టుబడులే ఎల్లక అప్పుల పాలతో అనేక అవస్థలు ఎల్లతీస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టు ద్వారా రాయగిరి చెరువును నింపి రాయగిరి చెరువు నుండి ఈ ప్రాంతానికి కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పత్తి మార్కెట్ ను కూడా ఈ ప్రాంత గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న జిల్లా మహాసభలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తీసుకోబోతున్నామని ఈ మహాసభల జయప్రదం కోసం ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి బోడా ఆంజనేయులు, సీపీఐ(ఎం) నాయకులు రావుల కిష్టయ్య, మంగ బుచ్చయ్య, ఏగ్గె కొమరయ్య, పల్లెర్ల సంజీవ, జిడికపల్లి బుచ్చయ్య, రావుల వెంకటయ్య లు పాల్గొన్నారు.