ఎంసీపీఐయూ ప్లీనరీని జయప్రదం చేయండి

నవతెలంగాణ-హన్మకొండ
నర్సంపేటలో ఈనెల 4,5,6 తేదీల్లో నిర్వహించే ఎం సీపీఐయూ రాష్ట్రస్థాయి స మా వేశాలను జయప్రదం చేయా లని జిల్లా కార్యదర్శి ఎన్‌రెడ్డి హంసరెడ్డి పిలు పునిచ్చారు. శుక్రవారం ఏకశిలా పార్క్‌లో ఎంసీపీఐయు జిల్లా కమిటీ పార్టీ ఆధ్వర్యంలో ప్లీనరీకి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, మాస్‌ సావిత్రి ,పార్టీ సభ్యులు యాకమ్మ ,హిందూ కళ్యాణి, రామ్‌ మోహన్‌, రాధిక, మణిమాల, సరళ, కాజ పాషా, సరిత,రాణి,అశ్విని,అఖిల, నందిని, వైష్ణవి, స్వరూపలు పాల్గొన్నారు.