నవతెలంగాణ – భువనగిరి రూరల్
పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఈనెల 16వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటలకు యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు స్థాయి యాదవుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గం రావడం జరుగుతుందని, వివిధ జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గం సమయానికి చేరుకొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం జనగణన వెంటనే చేపట్టడం, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎస్ ఎన్ టి రిజర్వేషన్ పునరుద్ధరించడం రిజర్వేషన్ను రద్దు చేయడం యాదవుల విద్యా ఉద్యోగాల అభివృద్ధికై ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం తోడ్పడే విధంగా చర్చించడం జరుగుతుందని, యాదవ కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం కోరారు.