సమృద్ధిగా వర్షాలు కురవాలని దేవతలకు నీళ్ల అభిషేకం..

Anointing water to the gods for abundant rains..నవతెలంగాణ – డిచ్ పల్లి
నెలా రోజులు దాటినా ఇప్పటికీ వర్షాలు కురియక ఇబ్బందులు పడుతున్నామని, సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామంలోని దేవతలకు నీళ్ల తో అభిషేకం చేస్తూ పాడి పంటలు, పశువులు సమృద్ధిగా  వర్షాలు కురవాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవతలకు గోదావరి నది నుండి గంగానీళ్లు తీసుకువచ్చి గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు పిల్లలు గ్రామ యువకులు వృద్ధులు అందరూ కలిసి గ్రామంలోని దేవతలకు నీళ్లు తోఅభిషేకం చేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ పల్ల రాజేశ్వర్,కుంట స్వామి, కోశాధికారి కుంట నవీన్,  చినిగిల బాలయ్య, ఎర్ర  గంగాధర్,  ములుగు సాయిలు తోపాటు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.