– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – కంఠేశ్వర్
సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనుకూలంగా మాట్లాడి నాలుగు నెలలు దాటినా కూడా వర్గీకరణ కాకుండా కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఛేదించడానికి హైదరాబాదులో వేల గొంతుకలు.. లక్ష డప్పుల మహోత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వేయి గొంతులు లక్ష డప్పులు సన్నాహక కార్యక్రమం నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ గురించి సభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ సభ ఉద్దేశం ఫిబ్రవరి 7న వేల గొంతులో లక్ష డప్పుల కార్యక్రమం నిర్వహించడం అని తెలిపారు. 2004 లో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నవంబర్ 5 2004 హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పును వెంటనే అమలుపరచుకొని ఇంతకు ముందు ఉన్న వర్గీకరణ చట్టాన్నిమాల కులస్తులు రద్దు చేయించడం జరిగిందన్నారు.25 సంవత్సరాల తర్వాత ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు ఇచ్చిందని అన్నారు. 2024 ఆగస్టు ఒకటి నాడు ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాలకులస్తులు ఒత్తిడి తీసుకువచ్చి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు కాకుండా మాలకులస్తులు కుట్ర చేస్తున్నారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అడ్డుకునే శక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సపోర్ట్ చేయకూడదనీ, హైదరాబాదులో లక్షల మందితో సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. మాదిగ కులస్తులు పెద్ద మొత్తంలో ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. మీ బిడ్డల బతుకులు బాగుపడాలంటే, పిల్లల చదువులు ముందుకు సాగాలంటే, మన పిల్లలకి చదువు ఉద్యోగాలు రావాలంటే, వేయి గొంతులు లక్షల డప్పుల సమావేశంలో ప్రతి ఒక్కరు డప్పులతో పాల్గొనాలని అన్నారు. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఇంటికో డప్పుతో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల కోసం పోరాటం 30 సంవత్సరాలు దాటిందని తెలిపారు. ఇంత కాలం ఉద్యమం నడుస్తున్న నా ఒంటిపైన నల్ల కండువా మారలేదని, పార్టీలకతీతంగా ఎటువంటి పదవి ఆశించకుండా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేశానని అన్నారు. బీసీ సంక్షేమ నాయకుడు ఆర్. కృష్ణయ్య బీసీల గురించి అనేక పోరాటాలు చేశాడని, ఆయన నాలుగు పార్టీల కండువాలు మార్చారని తెలిపారు.ప్రస్తుతం బిజెపిలో రాజ్యసభ నాయకుడుగా కొనసాగుతున్నాడని అన్నారు. నేను మీ బిడ్డగా 30 ఏళ్లలో ఒంటిమీద కండువ మారలేదు, నాకు ఎన్నో పరిచయాలు రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అని తెలిపారు. ఏ పార్టీలో చేరిన నాకు పదవులు రావడం జరుగుతుంది కానీ ఎస్సీ వర్గీకరణ సాధించలేమని నేను ఏ పార్టీలో కూడా చేరలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలా రేలా గంగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు, ఎమ్మార్పీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఎంఈఎఫ్ ఎంఈఎఫ్ యాదయ్య, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ సాయికుమార్, వెంకట స్వామి రాష్ట్ర కన్వీనర్, తదితర నాయకులు పాల్గొన్నారు.