– స్థానిక బ్రాండ్ల అమ్మకాల కోసమే సర్కార్ నాటకాలు : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యునైటెడ్ బేవరీస్ కంపెనీ (యూబీఎల్) తమ ఉత్పత్తులైన కింగ్‌ఫిషర్ బీర్ల నిలిపివేతలో కుట్ర కోణం దాగుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. బీర్ల సరఫరాకు సంబంధించి బకాయిలు చెల్లించడంలో టీజీబీసీఎల్ విఫలమవడంతోనే సదరు సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. స్థానిక బీర్ల బ్రాండ్లైన ‘భూమ్.. భూమ్, బిర్యాని బీర్ల కంపెనీలను ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూబీఎల్‌కు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో బేవరేజెస్ కంపెనీలకు బకాయిలు చెల్లించేదనీ, అదే విధానాన్ని పాటించాలని రేవంత్ సర్కార్‌కు ఆయన సూచించారు.