రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

– మోడీ.. సంపన్నులకు ఓ ‘సాధనం’..: రాహుల్‌
కోజికోడ్‌: దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని మోడీ ఓ సాధనంగా మారారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. వారి బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటూ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోజికోడ్‌లోని కొడియత్తూర్‌లో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోడీ సాధనంగా మారారు. వారి రుణాలను మాఫీ చేయించారు. ఇప్పటి వరకు 20-25 మందికి దాదాపు రూ.16 లక్షల కోట్లు ఇచ్చారు. భారత్‌లో రైతు సమస్యలపై ఆయన అసలు మాట్లాడరు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావించరు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు.