ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కుట్ర

– ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌పై వినోద్‌రెడ్డి, కత్తివెంకటస్వామి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ జంట నగరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు జీఎం వినోద్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి ఆరోపించారు. దాన్ని అడ్డు కునేందుకు అదనపు పోలీసు బలగాలను మొహరించాలని కోరారు. తద్వారా శాంతి భద్రతలను రక్షించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటోందని తెలిపారు.