రాష్ట్ర ప్రభుత్వాని బదనాం చేసే కుట్ర

– మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర జరుగుతున్నదని మాజీ ఎంపీ హనుమంతరావు చెప్పారు. తద్వారా కాంగ్రెస్‌ సర్కారును అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విగ్రహాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ నేతలు మతతత్వ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.