నల్లగొండలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable commits suicide in Nalgonda– భార్యతో వివాదాలే కారణం
– మృతుడు యాదగిరిగుట్టలో ట్రాఫిక్  కానిస్టేబుల్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
భార్యతో గొడవల కారణంగా నల్లగొండ పట్టణంలోని పూజిత అపార్ట్మెంట్లో శనివారం కలుకూరి రవిశంకర్ (40) అనే కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు యాదగిరిగుట్ట లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు సంబంధించి నల్లగొండ టూ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన రవిశంకర్ కు స్వాతి అనే మహిళతో 17 సంవత్సరాల క్రితం జరిగింది. స్వాతి నార్కెట్ పల్లి డిపోలో కండక్టర్ గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఎస్సై నాగరాజు చెప్పారు. శుక్రవారం రవిశంకర్ చెరువుగట్టులోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. శనివారం మధ్యాహ్నం నల్లగొండ పట్టణంలోని తన ఇంటికి వచ్చిన రవిశంకర్ బెడ్ రూమ్ లో పడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళగా భార్య ఇద్దరు పిల్లలు హాల్లో ఉన్నారు. సాయంత్రం అయినా రవిశంకర్ బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం తలుపు కొట్టినా ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో  బలవంతంగా తలుపులు తెరిచి చూడగా రవిశంకర్ ఉరివేసుకొని కనిపించాడు. మృతునికి బాబు, పాప ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు చెప్పారు.