భిన్న కాన్సెప్ట్‌తో ‘కానిస్టేబుల్‌’

'Constable' with a different conceptవరుణ్‌ సందేశ్‌ హీరోగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కె దర్శకత్వంలో జాగతి మూవీ మేకర్స్‌ పతాకంపై బలగం జగదీష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్‌’. ఈ చిత్రంతో మధులిక వారణాసి  హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’కానిస్టేబుల్‌ టీజర్‌  ఉత్కంఠభరితంగా ఉంది. వరుణ్‌ సందేశ్‌ కానిస్టేబుల్‌గా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రాబోతున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. వరుణ్‌ సందేశ్‌కు మరింత  మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలు ఇలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌తో సినిమాలు చేసి సక్సెస్‌ కొట్టాలి. త్వరలోనే ఈ చిత్రం ఆడియెన్స్‌ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి  సక్సెస్‌ చేయండి’ అని అన్నారు. ‘మా టీజర్‌ను విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్‌. నేను ఆయనతో చేసిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ అనే చిత్రం నాకు చాలా  ఇష్టం. ‘కానిస్టేబుల్‌’ టీజర్‌ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ మూవీ టీజర్‌ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ మాట్లాడుతూ, ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన హీరో వరుణ్‌ సందేశ్‌, నిర్మాత బలగం జగదీష్‌కి థాంక్స్‌’ అని అన్నారు. ‘హీరో వరుణ్‌ సందేశ్‌కు ఈ చిత్రం మంచి కమ్‌ బ్యాక్‌ అవుతుందని నా గట్టి నమ్మకం’ అని నిర్మాత బలగం జగదీష్‌ చెప్పారు.