సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

– జిట్టబోయిన రమేష్ ముదిరాజ్ సంఘం పసర రాంపూర్ గ్రామ అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట:
పసర రాంపూర్ ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షునిగా సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆ సంఘం నూతన అధ్యక్షుడు జిట్టబోయిన రమేష్ అన్నారు. శనివారం మండలంలోని పసర రాంపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముదిరాజు కుల సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా, జుట్టబోయిన రమేష్ ఉపాధ్యక్షుడు దండు రామచందర్ ప్రధాన కార్యదర్శి గడ్డం సాయి సహాయ కార్యదర్శి ఏల కవిత కోశాధికారి మునిగాల వినయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులు ముదిరాజ్ సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కులం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పట్ల అదేవిధంగా కులములో పేదవారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అన్ని రంగాల్లో సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఇతర సంఘాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా సమైక్యంగా పరిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గడ్డం సాయి, మునిగాల వినయ్, ఏల కవిత, పొన్నబోయిన భద్రయ్య, గొడుగు అశోక్, ఒద్దుల సాయి, ఓరుగంటి మల్లికార్జున్, బుచ్చయ్య  తదితరులు పాల్గొన్నారు