– ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఎన్నికలను దష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేగాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలకేంద్రంలోని సిరి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాల బూతు స్థాయి కమిటీలు, గ్రామ శాఖ, మండల శాఖ కమిటీల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ప్రతి బూత్ కమిటీ సభ్యుడు 100 ఇండ్లకు వెళ్లి ఆయా ఇళ్లలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలిపి దానికి అనుగుణంగా మా టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలను సవివరంగా తెలియపరచాలని బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. రానున్న ఎన్నికల దష్ట్యా ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని ప్రతి ఓటర్ను కలవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే అమలవుతున్న దళిత బంధు, బీసీ బందు, గహలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ,కల్యాణ లక్ష్మి ,ఆసరా పెన్షన్లు అందరికీ అందిస్తున్నామని ఒకవేళ రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అందిస్తామని తెలియపరిచారు. అభివద్ధి సంక్షేమ పథకాల విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు.బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు.రానున్న ఎన్నికల దష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పేదలకు మేలు చేసేదిగా ఉందని ప్రజలు దీనిని గమనించి బీఆర్‌ఎస్‌ని ఆశీర్వదించి మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు మనందరం సంసిద్ధులం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటులో ఉందని అన్నారు ముఖ్యంగా సాగు తాగునీటి రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందన్నారు.రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అందుకు బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు నిర్విరామంగా కషి చేయాలని అన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ కావాలని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం తుంగతుర్తి నియోజకవర్గం అభివద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా పలువురి విపక్షాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్‌రావు, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్‌కె.రజాక్‌లతో పాటు మూడు మండలాల అధ్యక్షులు, బూతు ఇన్‌చార్జిలు,బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.