ముందస్తు పంటల సాగు పై నియోజకవర్గ స్థాయి సదస్సు 

– రైతులు  సదస్సును సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ముందస్తు పంటల సాగుపై  శనివారం నియోజకవర్గ స్థాయి రైతులకు అవగాహన  సదస్సుకు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్   ముఖ్య అతిథిగా విచ్చేస్తారని నసురుల్లాబాద్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలంలోని  నెమ్లీ సాయిబాబా కళ్యాణ మండపంను  పరిశీలించారు. ఈ సందర్భంగా  పెర్క శ్రీనివాస్  మాట్లాడుతూ ఈ సదస్సుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తున్నారని, ముందస్తు పంటల సాగుపై అవగాహన కల్పిస్తారని, రైతుల అనుమానాలను నివృత్తి చేస్తారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లీ సాయి బాబా మందిరం వెనుక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ముందస్తు పంటల సాగు తో   రైతులు ప్రకృతి వైపరీత్యాలతో తప్పించుకోవచ్చుకునే విదంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగహన కల్పిస్తారని తెలిపారు.వీరి వెంటప్రజాప్రతినిధులు అధికారులు  తదితరులు ఉన్నారు.