మహాలక్ష్మితో నియోజక వర్గం ప్రజలకు పాక్షిక ప్రయోజనం..

– నియోజక వర్గం కేంద్రం నుండి నేరుగా జిల్లా కేంద్రానికి సర్వీసులు శూన్యం

– గ్రామీణ మహిళలకు కలగని ప్రయోజనం
– సర్వీసులు విస్తరించాలని ప్రజలు వేడుకోలు
నవతెలంగాణ-అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజక వర్గంలో మహిళా లే అధికం అయినప్పటికీ ఈ మహాలక్ష్మీ పధకంలో వీరికి పాక్షిక ప్రయోజనమే చేకూరనుంది.ఓటర్లు పరంగానూ మొత్తం 1,55,961 మంది ఉండగా ఇందులో 76,193 మంది పురుషులు,79761 మంది స్త్రీలు,ఏడుగురు ఇతరులు ఓటర్లు గా ఉన్నారు.కానీ నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట నుండి జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం ప్రయాణించాలి అంటే కొత్తగూడెం డిపో నుండి ఒకే బస్ ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం మూడు దఫాలు మాత్రమే అశ్వారావుపేట నుండి దమ్మపేట,ములకలపల్లి,పాల్వంచ మీదుగా కొత్తగూడెం సర్వీసు ఉంది.మిగతా సమయాల్లో జిల్లా కేంద్రం వెళ్ళాలన్నా,ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఖమ్మం జిల్లా,సత్తుపల్లి,బంజారా మీదుగా దూరాభారం భరించి ప్రయాణం చేయాల్సి వస్తుంది. నియోజక వర్గం లోని అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డి పల్లి ఈ అయిదు మండలాలు కలుపుతూ నాణ్యమైన జిల్లా రహదారులు ఉన్నప్పటి ఈ మండలాల మహిళలు ప్రయాణం చేయాలంటే బస్ ల సర్వీసులు సరిపడ నన్ని లేకపోవడం కారణమే.మండలాలు లోని మారుమూల ప్రాంతం గ్రామాలు నుండి నియోజక వర్గం కేంద్రం ప్రయాణించాలన్నా బస్ లు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సిందే. అశ్వారావుపేట నుండి తెలంగాణా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కు మహిళా భక్తులు వెళ్ళాలన్నా అశ్వారావుపేట మండలం కుడుములు పాడు నుండి బూర్గంపాడు వరకు సుమారు 50 కి.మీ మేర ఆంధ్ర భూభాగం నుండి ప్రయాణించాల్సి ఉంది.టి ఎస్ ఆర్ టి సి బస్ సర్వీసుల్లో తెలంగాణ మహిళలు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆంధ్రా భూభాగంలో టికెట్ తప్పని సరి చేసారు.దీంతో ఈ మహాలక్ష్మి పధకం ఈ నియోజక వర్గం మహిళలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందాలంటే నియోజక వర్గం కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి సర్వీసులు పెంచాలి.మండలాలను కలుపుతూ పల్లె వెలుగు సర్వీసు లు విస్తరించాలి.తెలంగాణ బస్ లలో ఆంధ్రా భూభాగంలో టికెట్ కు మినహాయింపు ఇవ్వాలని మహిళా సంఘాలు నాయకురాళ్ళు,మహిళా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.