రాజ్యాంగ రక్షణ దినోత్సవాలు జరపాలి

Constitution Defense Days should be observed– కెవిపిఎస్,  జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు, దుబ్బలింగం.. అన్నం పట్ల కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
తరతరాలుగా కులవివక్ష అంటరానితనం, అనేక అవమానాలకు గురవుతున్న దళితుల ఆత్మగౌరవం కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉండేలా జిల్లాలోని మండలాలలో ప్రతినెల 30వ తేదీన ఏదో ఒక గ్రామంలో పౌర హక్కుల దినం నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బలింగం అన్నం పట్ల కృష్ణ డిమాండ్ చేశారు. నూతనంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన సందర్భంగా దుబ్బ లింగం అన్నం పట్ల కృష్ణ మాట్లాడారు. శాస్త్ర సాంకేతికరంగాలలో ప్రపంచం తో పోటీగా ఎన్నో రేట్లు అభివృద్ధి చెందిన భారతదేశంలో నేటికీ సాటి మనుషులను మనుషులుగా చూసే వ్యవస్థ ఇంకా రాలేదన్నారు. సనాతన ధర్మం పేరుతో నేటికీ గ్రామాలలో దళితులను గుడిలోనికి రానివ్వడం లేదన్నారు. తాగే మంచినీళ్ల వద్ద గ్రామ పంచాయతీల వద్ద దళితులపై ఇంకా వివక్షత కొనసాగుతుంది పైకి కనబడని అనేక రకాల వివక్షతలు ఎస్సీలు, ఎస్టీలు అనుభవిస్తున్నారన్నారు. ఎస్సీ , ఎస్టీ , అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన దళితులపై దాడులు ,దౌర్జన్యాలు మరియు కులాంతర వివాహం చేసుకుంటే కుల దూలంకార హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న పాలకులు సామాజిక వివక్షతను  రూపుమాపలేకపోతున్నారన్నారు. ప్రభుత్వాలు మారిన వ్యక్తులు పాలకులుగా మారుతున్నారు తప్ప వారి విధానాలు ధనవంతులకు అగ్రకులాలకు అనుకూలంగా ఉంటున్నాయని తెలిపారు. రెక్కల కష్టం పై ఆధారపడే దళితులకు అవమానాలు తప్పడం లేదన్నారు. భూమి లేని దళితులు అగ్రవర్ణ భూస్వాములపై ఆధారపడి జీవించవలసి వస్తుందన్నారు. భూమిలేనటువంటి దళితులను ప్రభుత్వం గుర్తించి ప్రతి కుటుంబానికి మోడీ ఎకరాల భూమి ఇచ్చి ,ఆర్థికంగా అభివృద్ధి గ్రామాలలో సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాల ద్వారా ప్రజలందరికీ చైతన్య పరిచినప్పుడే సామాజిక ఆర్థిక అంతరాలను అరికట్టవచ్చునని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.