రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది: కర్ర శ్రీనివాస్ రెడ్డి 

Constitution is the most sacred: Karra Srinivas Reddyనవతెలంగాణ – పెద్దవంగర

భారత రాజ్యాంగ అత్యంత పవిత్రమైనదని, సర్వోన్నతమైనదని బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం సంవిధన్ గౌరవ అభియాన్ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నామన్నారు. దేశంలోని ప్రతి పౌ రుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనదని సర్వోన్నతమైనదని తెలిపారు. గత నెల లో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై పార్లమెంట్ ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరిగిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసా హెబ్ అంబేద్కర్ గౌరవార్థం పంచతీర్థాల అభివృద్ధితోపాటు పేదలు, అణగారిన వర్గా ల సంక్షేమంకోసం అనేక పథకాలను లను అమలుపరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బొచ్చు సురేష్ యాదవ్, తొర్రూర్ రూరల్ అధ్యక్షుడు గట్టు రాంబాబు, ఎస్సీ మోర్చా మండల నాయకుడు జలగం ఆనంద్, ఎస్టీ మోర్చా జాటోత్ శంకర్, బొట్టు మంచి శ్యామ్, దేశెట్టి వెంకటనారాయణ, కోట కుమార్, రాంపల్లి హరీష్, పగిడిపల రాజు, రాపోలు అన్వేష్, గజ్జి పవన్ తదితరులు పాల్గొన్నారు.