– రాజ్యంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాత్ర గొప్పది
– కామారెడ్డి శాసన సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి
భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించరు.ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్నింటి కన్నా ప్రాముఖ్యమైనదనీ 75ఏళ్లు గడిచినా ఇంకా పాలన ప్రజాస్వామ్య యుతంగా జరుగుతుంది అంటే రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. నేటి తరం ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండాలనీ అన్నారు. రాజ్యంగ నిర్మాణంలో ఎంతో మంది కృషి చేశారని అందరిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాత్ర గొప్పదనీ గుర్తు చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ రాజ్యగాన్ని 80సార్లు సవరించి, 42 వ రాజ్యాంగ సవరణతో ప్రజాస్వామ్యాన్ని హరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నీ విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగటం సిగ్గు చేటని అన్నారు. మోది హయంలో నే రాజ్యాంగానికి, అంబేద్కర్ కు పూర్తి గౌరవం దక్కిందనీ అన్ని రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపడుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ లు నరేందర్, శ్రీనివాస్, నాయకులు భరత్, సురేష్, ఈశ్వర్, వేణు, వెంకట్ రెడ్డి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.