భారత రాజ్యాంగమే దేశానికి రక్ష: డీబీఎఫ్

– డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నవతెలంగాణ – తొగుట
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం సామాజిక, ఆర్ధి క, రాజకీయ న్యాయం పునాదిగా ఏర్పడ్డ భారత రాజ్యంగమే దేశానికి రక్ష అని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగం పై డీబీఎఫ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలలో నిర్వ హించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులకు బహుమతులను ప్రధానం చేశారు.  రాజ్యాంగ పిఠిక ను ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కుల, మత, జెండర్, రంగు, ప్రాంతం పేరుతో తేడాలు చూపించవద్దని హితవు పలికారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి జ్ఞానాన్ని పొందాలన్నారు. భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, గ్రామ నాయకులు జీడి పల్లి రాంరె డ్డి, వడ్డె కిష్ఢయ్య, జర్నలిస్టు పొతరాజు రవిందర్, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.