రాజ్యాంగ బద్దంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి..

– ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్..
నవతెలంగాణ – వేములవాడ 
రాజ్యాంగ బద్దంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అని ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని, బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా ప్రకటించిన తదుపరి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సాధికారిత సంఘం పక్షాన కోరుతున్నట్లు ఆయన తెలిపారు.బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనడం హాస్యాస్పదం అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకొనుటకు ,కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందేలా,ఎలాంటి కోర్టు చిక్కులు రాకుండా చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పించుటకై కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను నరేందర్ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ కుల సర్వే తప్పుల తడకగా ఉందని,ఇట్టి సర్వేను రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంగీకరించడం లేదని, గత ప్రభుత్వ సర్వేలో బీసీల జనాభ 51 శాతం ఉందని,నేటి సర్వేలో బీసీ జనాభ 46 శాతం ఉందని,గతంలో కంటే బీసీ జనాభ పెరగాల్సింది ఉండగా,5 శాతం తగ్గడం విడ్డూరంగా ఉందని ఏద్దవా చేశారు. ఇప్పటికైన నిపుణుల కమిటీని వేవాలని,అన్ని అంశాలపై చర్చించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనుటకుగాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ
రూపొందిస్తామని అన్నారు.