రాజ్యాంగ శిల్పి అంబేద్కర్: గనపాక సుధాకర్ 

నవ తెలంగాణ-గోవిందరావుపేట
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గణపాక సుధాకర్ అన్నారు.ఆదివారం  మండలం లోని చల్వాయి గ్రామంలో బీమ్ రాం అంబేద్కర్ యూత్ అధ్యక్షులు తోడేటి అశోక్ అధ్యక్షతన అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా గనపాక సుధాకర్ హాజరై  మాట్లాడుతు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి ర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. దళితులు అన్నిరంగాలలో రానించాలని ఈప్రపంచంలో విద్య చాలా విలువైనది విద్యకు ముఖ్య పాత్ర ఇవ్వాలని అన్నారు అదేవిదంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, యువత దేశానికి పట్టుకొమ్మ అని యువత అన్ని రంగాలలో రానించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి, అనీల్ యాదవ్,ఉపాధ్యక్షుడు గుజ్జ ప్రేమ్, కార్యదర్శి జక్కీ వికాస్ రాజ్, కోశాధికారి కుమ్మరి రామ్,తరుణ్ మహారాజ్,సీనియర్ సలహాదారులు చిలుకబత్తిని లూకాస్, జక్కీ ప్రభాకర్. చ్చిలుకబత్తిని చిన్న అప్పారావు, చింతామల్ల రమేష్. ఎర్ర మల్ల శ్యామ్, దమ్మల్ల ఎషోబ్ చిలుకబత్తిని అశోక్ బత్తుల కృష్ణ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.