
– ఎమ్మెల్సీ వాఖ్యలను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి జేఏసీ వినతిపత్రం
– తీన్మార్ మల్లన్నను భర్తరఫ్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ – బెజ్జంకి
ఒడ్డుక్కెకా ఓడ మల్లన్న.. ఒడ్డుదిగాక బోడ మల్లన్న అనే చందంగా తీన్మార్ మల్లన్న వ్యవహరముందని.. రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ హోదాలో కొనసాగుతూ.. రాజ్యాంగ విరుద్దంగా కులాలపై వాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి జేఏసీ మండలాధ్యక్షుడు ముక్కీస తిరుపతి రెడ్డి మండిపడ్డారు.వరంగల్ పట్టణంలో నిర్వహించిన బీసీ యుద్ధభేరి సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్సీగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం మల్లన్నను భర్తరఫ్ చేయాలని మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి రెడ్డి జేఏసీ అధ్వర్యంలో వినతిపత్రమందజేశారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గం సమాజంలోని అన్ని కులాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ జీవనం సాగిస్తారని.. తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గంపై వాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సామాజిక వర్గాల సమన్యాయానికి తీన్మార్ మల్లన్న న్యాయబద్ధమైన పోరాటాలను స్వాగతిస్తామని..ఇతర కూలాలపై వాఖ్యలు చేయడం ఖండిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీటీసీల పోరం మండలాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవ్వ లింగారెడ్డి, రెడ్డి జేఏసీ నాయకులు చెన్నాడీ సుధాకర్ రెడ్డి, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.