రాజ్యాంగ సంరక్షణకు పాటుపడాలి..

Should be taken care of the constitution..– హెడ్ మిస్ట్రెస్ సయ్యదా జహ్ర ఖాద్రి

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలోని సెయింట్ అలీయుద్దీన్ స్కూల్ లో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవo పురస్కరించుకొని పాఠశాలలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సయ్యదా జహ్ర ఖాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశ సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని సూచించారు.భారత రాజ్యాంగంలోని విలువలు,రాజ్యాంగ సంరక్షణకు పాటుపడాలని విద్యార్థులను కోరారు. మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సయ్యదా జహ్ర ఖాద్రి బహుమతులను అందజేశారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సయ్యదా హలీమా ఖాద్రి, కరస్పాండెంట్ సయ్యదా సల్మా ఖాద్రి, జాయింట్ సెక్రెటరీ సయ్యదా నువెరా ఖాద్రి, ట్రెజరర్ ఖదిజ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.