వైద్య సబ్ సెంటర్ల నిర్మాణ భవనాలు స్లాబ్ లేవళ్లకే పరిమితం

– సెంటర్ల నిర్మాణాలు పూర్తి గాక ఆరోగ్య సౌకర్యాలకు ఇబ్బందులు
– పెండింగుకు కారణం బిల్లులు రాకనే, ఏ ఈ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో రెండు చోట్ల వైద్య సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా, వాటి నిర్మాణాలు స్లాబ్ లెవల్ప కే రిమితం అయ్యాయి సబ్ సెంటర్ల నిర్మాణాలు పెండింగ్ పడడం ఆరోగ్య సౌకర్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.20 లక్షల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేసి నిర్మాణం పనులు చేపట్టింది. మండల కేంద్రంలో రెండు సబ్ సెంటర్లు నిర్మాణాలు పూర్తి చేయడంలో సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాక, పెండింగు పెట్టినట్లు పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్ నవ తెలంగాణకు వివరించారు. వైద్య సబ్ సెంటర్లు ప్రజల ఆరోగ్య సౌకర్యాలకు ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి సెంటర్లు నిర్మాణం పూర్తికాక పెండింగ్ పడడం ఆరోగ్య సమస్యలకు ప్రజలు ఆరోగ్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం పనులు చేపడితే వాటి బిల్లులు మంజూరు కాక రెండు సబ్ సెంటర్లు భవనాల నిర్మాణాలు ముందుకు సాగలేక పెండింగ్ పడ్డాయి. గత ప్రభుత్వంలో చేపట్టిన వైద్య సబ్ సెంటర్ల నిర్మాణం పెండింగ్ పనులను ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయించి ఆరోగ్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామం ప్రజలు కోరుకుంటున్నారు.