నిజాం సాగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ. 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మండల మాజీ జెడ్పీటీసీ చీకోటి జయప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజం సాగర్ మండలంలోని అన్ని గ్రామాలలో దశలవారీగా రోడ్డు నిర్మాణం చేపడతామని అలాగే ఏవైతే మిగిలిన అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, నాయకులు నాగభూషణం గౌడ్, నారాయణ, కిష్టగౌడ్ తదితరులు పాల్గొన్నారు.