అక్రమ ఇళ్ళ నిర్మాణం ఆపాలి

– ఎమ్మార్వో ను కలిసి ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు 
నవతెలంగాణ దుబ్బాక రూరల్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మార్వో వెంకట్ రెడ్డి కి కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించిన సర్వే నం.417, 418 లలో గల భూమిలో అక్రమంగా కొందరు ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు.గతంలో ఆ స్థలాన్ని తాము అధికారులతో సర్వే చేయించగా.. అందులో ఏలాంటి నిర్మాణాలు చేపట్టిద్దని తీర్మానించి హద్దులు పాతారని అన్నారు. కానీ వారు అక్రమార్కుల అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని వెంటనే ఆ స్థలంలో జరిగే ఇంటి నిర్మాణాన్ని ఆపాలని కోరారు. తమ దగ్గరున్న ఆధారాలతో ఎమ్మార్వో కి , దుబ్బాక ఎస్ఐ, పంచాయతీ సెక్రటరీలకు వినతి పత్రం అందించామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాలెంల నర్సరెడ్డి,వార్డు మెంబర్ బాలెంల రామచంద్రారెడ్డి,ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలెంల భాస్కర్ రెడ్డి,యాడరం రాజు గౌడ్, బోల్గం ప్రవీణ్ గౌడ్,నాగరాజు, నవీన్ రెడ్డి, శంకర్, నగేష్,నజీర్,తదితరులున్నారు