అభ్యుదయ కాలనీలో రామాలయ నిర్మాణం

Construction of Ram Temple in Abhyudaya Colonyనవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలోని అభ్యుదయ కాలనీలో సోమవారం  ఉదయం ఎనిమిది గంటలకు  రామాలయ నిర్మాణ క్రమంలో ముందుగా సింహద్వారా ప్రతిష్ట పూజలు నిర్వహించి గర్భగుడి యొక్క దర్వాజ ఎత్తడం జరిగింది. ఈ కార్యక్రమానికి పస్ర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ఉత్సాహంతో పూజలను జరిపించారు. ఈ రామాలయం రాంపూర్ గ్రామ రామాలయంగా ఎల్లప్పుడూ పూజా కార్యక్రమాలు నిర్వహించుటకు రాంపూర్ లోని అన్ని ప్రాంతాల వారికి అన్ని రకముల స్వేచ్ఛ ఉంటుందని అందరం ఏకాభిప్రాయంతో నిర్ణయించుకున్నారు. ఈ గుడి నిర్మాణ ప్రస్తావ్యాన్ని గ్రామస్తులు వివరిస్తూ రామాలయం 2019లో డిసెంబర్ 6వ తారీకున  శంకుస్థాపన చేయబడింది. మొట్టమొదట ఈ గుడి నిర్మాణానికి మా కాలనీవాసుల అభ్యర్థనను గౌరవించి దయార్థ హృదయుడైనటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిసి సభ్యులు పైడాకుల అశోక్ చల్వాయి  ఏకకాలంలో పెద్ద మొత్తంలో చేసిన ఆర్థిక సహాయంతో గర్భగుడి, మండపము ష్లాపులు, మరియు గుడి ప్రహరీ నీ మా అందరి ఐక్య కృషితో పూర్తి చేయించామని గుర్తుచేసుకున్నారు. అప్పట్నుంచి మా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులు సరిపోక ఈ గుడి తాత్కాలికంగా పనులు నిలపవలసి వచ్చిందని ఇప్పుడు పెద్ద మొత్తంగా సహాయం చేసే దాతలు ముందుకు రావడం వలన తిరిగి ఈ గుడి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టుకుందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పసరా, రాంపూర్ ,అభ్యుదయకాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.