పూర్తయిన వీర హనుమాన్ ఆలయ నిర్మాణం

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని కోస్లీ శివారు వ్యవసాయ క్షేత్రంలో వీర హనుమాన్ ఆలయ నిర్మాణం పూర్తయి సోమవారం విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నట్లు ఆలయ నిర్మాణకర్త మువ్వ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. నిర్మాణ ప్రారంభ దశలో ఎల్కే ఫారంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అతి పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అన్ని అవాంతరాలు దాటి అంగరంగ వైభవంగా ఆదివారం ఐదుగురు అర్చకులతో హోమాధి కార్యక్రమాలు నిర్వహించి సోమవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.