ప్రహరీ నిర్మాణం ఆపాలి

ప్రహరీ నిర్మాణం ఆపాలి– నక్షబాట హద్దులు చెరిపి వేత
– ఫాంల్యాండ్‌ యజ మానులపై
– కఠిన చర్యలు తీసుకోవాలి
– తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
నవతెలంగాణ-కందుకూరు
నక్షబాట హద్దులు చెరిపి వేసి, ప్రహరీగోడ నిర్మిస్తున్న ఫాంల్యాండ్‌ యజ మానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కందుకూరు తహ సీల్దార్‌ గోపాల్‌, కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో నేదునూర్‌ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు గడిగా రాములు, కళ్యాణ్‌ కార్‌ వరు ణ్‌ కుమార్‌, దేవరకొండ రాములు, మర్లకష్ణ మాట్లాడుతూ..5 నెలల నుండి ఎలక్ట్రిషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొంత మంది కందుకూరు మండలం నేదు నూరు గ్రామంలో 76 ఎకరాల్లో ఫాంల్యాండ్‌ పేరుతో రైతులు వారి పొలాలకు వెళ్లకుండా నక్షబాట హద్దులు చెరిపి వేసి, ప్రహరీగోడ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. వెంటనే గోడ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని డిమాం డ్‌ చే శారు. లేదంటే ఆందోళన చేస్తామనీ హెచ్చరించారు.