డ్రయినేజీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభం

– పాల్గొన్న ఎమ్మెలే గాంధీ, కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్‌లోని సెంట్రల్‌ పార్క్‌ ఫేస్‌-1 వద్ద రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రయినేజీ పైప్‌ లైన్‌, రూ.17 లక్షల వ్యయంతో వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, శేరి లింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌లు ప్రా రంభించారు. వారు మాట్లాడుతూ..స్థానికుల ఇబ్బం దులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలి పారు. డివిజన్‌లో దశలవారిగా మురుగు నీటి లీకేజీ సమ స్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాటర్‌ వర్క్స్‌ జనరల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, వాటర్‌ వర్క్స్‌ మేనేజర్‌ విక్రమ్‌ రెడ్డి, సత్యనారాయణ, గోపాల్‌ యాదవ్‌ సెంట్రల్‌ పార్క్‌ కాలనీ వాసులు, అలిండ్‌ సొసైటీ కాలనీ వాసులు తదితరులున్నారు.