సిద్దుల గుట్టపై పిరమిడ్ నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ-ఆర్మూర్
సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ నందు నిర్మిస్తున్న శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం నిర్మాణంలో భాగంగా 72×72 స్ట్రక్చర్ నిర్మాణ పనులను ఈరోజు మూడు క్రేన్ల సహాయంతో నందీశ్వర మహారాజు గారు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. చాలా చక్కని ధ్యాన మందిరం నిర్మించడం ఆనందదాయకమని తెలిపారు. తక్కువ రోజుల్లోనే పనులు చురుకుగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు ద్యానులను అభినందించారు..
ఈ కార్యక్రమంలో  ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లా గంగారెడ్డి , అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, తిరుమల గంగారం , ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ సార్ , కూనింటి శేఖర్ రెడ్డి , పెంబర్తి నారాయణ  మండల రాజారాం , బొబిడి గంగా మోహన్, సుభాష్ దగ్గుపల్లి రాజన్న గగ్గుపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.