
వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై తెలంగాణ రాష్ట్ర స్థాయి రెండు రోజుల శిక్షణ శిబిరం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆగస్టు 10 11 తేదీలలో నిర్వహిస్తున్నామని నలగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షులు ఏ హిమగిరి అన్నారు శుక్రవారం చండూరులో చలో నాగార్జునసాగర్ గోడపత్రిక విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు బాధ్యతలు, వినియోగదారుల కమిషన్ పనితీరు కల్తీ ఆహార పదార్థాల నిర్మూలన తూనికల కొలతలలో మోసాలు సైబర్ క్రైమ్ నుండి రక్షణ కల్పించుకోవడానికి శిక్షణ శిబిరంలో చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వినియోగదారుల కమిషన్లు కేసులు సత్వరమే పరిష్కారం కావడానికి తగు చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఉన్న సమస్యలను తీసుకువెళ్లడం విద్యార్థి దశ నుంచే వినియోగదారుల అవగాహన కల్పించడం కోసం కన్జ్యూమర్ క్లబ్స్ కళాశాలలలో హై స్కూల్స్ తిరిగి పునరుద్ధరణ చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు వినియోగదారుల సంఘం అధ్యక్షుడు తిరందాస్ ఆంజనేయులు, తాందరి యాదయ్య, జూలూరు వెంకటేశం ఇడికోజు నాగరాజు, రాపోలు జగదీశ్వర్లు, వెంకటరెడ్డి, గంజి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.