నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రం శివారులోని వినాయక ఫ్యూయల్ స్టేషన్ (హెచ్ పి బాంక్)లో డీజిల్ కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళన చేపట్టిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సన్నూరు శివారు బాల్ నాయక్ తండాకు చెందిన భూక్య సాయికుమార్, భూక్య నితిన్ ఇంటి వద్ద ఉన్న వాహనం కొరకు మండల కేంద్రం శివారులోని హెచ్ పి బంకులో 270 రూపాయల డిజిల్ ను కోనుగోలు చేసి కాళీ వాటర్ బాటిల్లో నింపుకున్నారు. తదుపరి డిజిల్ నాణ్యతలో అనుమానం వచ్చి బంకులో పనిచేస్తున్న ఆపరేటర్లను అడుగగా ీరు ఏమైనా ఉన్నత చదువులు చదివారా ?మీకు ఏమి తెలుసు అంటూ కించపరిచే విధంగా దుర్భాషలాడినట్లు వినియోగదారులు తెలిపారు. దాంతో డీజిల్ లో కల్తీ జరిగిందని వారు బంకు ఎదుట ఆందోళన చేపట్టారు. బంకు నిర్వాహకులను ఈ విషయంపై స్పందిస్తూ పక్క బంకు నిర్వాహకులు తమపై కావాలని ఆరోపణలు చేయిస్తున్నారు అని వ్యాఖ్యానించడం శోచనీయం.