ముంబయి : బజాజ్ ఫిన్సర్వ్ ఎఎంసి బజాజ్ ఫిన్సర్వ్ కొత్తఈగా కన్షప్షన్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అని ఆ సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఫండ్ నవంబర్ 8న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుందని.. 22న ముగుస్తుందని తెలిపింది. విస్తృత మార్కెట్లతో పోలిస్తే ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నందున పెట్టుబడికి ఇది సరైన సమయని బజాజ్ ఫిన్సర్వ్ ఎఎంసి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నిమేష్ చందన్ పేర్కొన్నారు.