నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైల గణపతి రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులుగా పారిశుద్ధం మంచినీరు సరఫరా, వీధిలైట్లు, డంపింగ్ యార్డ్ , హరితహారం, పల్లె ప్రగతి, ఇంటి పనులు, భూమిసిస్టులు, మార్కెట్ల నిర్వహణ, దుకాణాల పనులు, వసూలు, ఆఫీస్ నిర్వాహణ పనుల్లో వివిధ కేటగిరీలుగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. గ్రామాల్లో పరిశుద్ధ పనులు నిర్వహిస్తూ అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు. రాష్ట్ర కార్మికుల బతుకులు ఎల ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని, పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయలేదని కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ , ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కావడంలేదని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేస్తున్న తక్షణం చెల్లించాలని, కార్మికులకు ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, 60 జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలని, జనాభా ప్రాతిపాదికన కార్మికుల సంఖ్య పెంచాలని, ఈ ఎస్ ఐ , పిఎఫ్ సౌకర్యం సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలని, ఆదాయం ఉన్న గ్రామపంచాయతీలో వేతనాలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం నాయకులు, జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బందెల బిక్షం గడ్డం ఈశ్వర్ నాయకులు మంద యాదగిరి బాలరాజు బాబు సలీం కిష్టయ్య రాము ఎల్లయ్య సురేందర్ బాలయ్య రమేషు సామి స్వామి లక్ష్మమ్మ భాగ్య భాగ్యమ్మ రేణుక విజయలక్ష్మి ప్రమీల అరుణ లక్ష్మీ లు పాల్గొన్నారు.