కంటెంటే సూపర్‌స్టార్‌

Content Superstarపి.ఎన్‌.బి సినిమాస్‌ బ్యానర్‌ పై రూపొందురన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్‌ బలరామ్‌ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్‌  బాబు స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షరు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ‘ప్రేమలు’ చిత్ర ఫేమ్‌ మమిత బైజు హీరోయిన్‌గా  నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్‌. ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్‌తో ప్రేక్షకుల దష్టిని ఆకర్షించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రచయిత,  నిర్మాత పి.ఎన్‌. బలరామ్‌ మాట్లాడుతూ, ‘నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తు న్నాను. కృష్ణుడి వల్ల  మా కుటుంబంలో జరిగిన మిరాకిల్‌నే కథగా తీసుకున్నాం. అదేంటంటే మా అబ్బాయి అక్షరు అత్యంత అరుదైన డిసీజ్‌ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి  బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షరునే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేం స్టార్స్‌ని తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే కష్ణుడే సూపర్‌స్టార్‌, కంటెంటే సూపర్‌ స్టార్‌’  అని అన్నారు. ‘మా కుటుంబానికి, కృష్ణుడికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రం. మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేను ఈరోజు  ఇలా మీ ముందు ఉన్నాను.ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని హీరో అక్షరు తెలిపారు.