కంటెంటే గెలిపిస్తుంది

Content winsవెన్నెల కిషోర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్‌ కీలక పాత్రలు పోషించారు. రైటర్‌ మోహన్‌ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్‌ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నేడు (బుధవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్స్‌ బాబీ కొల్లి, కళ్యాణ్‌ కష్ణ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి మాట్లాడుతూ,’మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. ప్రోడక్ట్‌ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కంటెంట్‌ని నేను బలంగా నమ్మాను. ఆ కంటెంట్‌ నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను. ఈ ఏడాది ‘పుష్ప2′ తర్వాత హైయ్యస్ట్‌ గ్రాసర్‌ ఈ సినిమానే అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసి నచ్చలేదని ఎవరైనా అంటే నా నెంబర్‌కి సంప్రదించవచ్చు. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమా నా కెరీర్‌ని అలాగే ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ కెరీర్‌ని నెక్స్ట్‌ లెవెల్‌ తీసుకెళ్తుంది. ఈ సినిమాకి ఎర్లీ బర్డ్‌ షోస్‌ వేస్తున్నాను. వర్డ్‌ అఫ్‌ మౌత్‌తో బాగా స్ప్రెడ్‌ చేసి, సినిమాని సూపర్‌ హిట్‌ నుంచి బ్లాక్‌ బస్టర్‌ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.