– రాష్ట్ర అధ్యక్షులు మందప్రభాకర్
నవతెలంగాణ – కామారెడ్డి
బహుజన్ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు మందప్రభాకర్ హాజరై మాట్లాడారు. జన కళ్యాణ్ గురించి మాట్లాడి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి పోటీ చేసి గెలిచే విధంగా దశ దిశలు నాయకులకు కార్యకర్తలకు సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది మహానీయుల యొక్క సిద్ధాంతాలపై నిర్మించబడిన పార్టీ అని, రాజ్యాంగాన్ని రక్షింఛే పార్టీ, రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఎస్సి, ఎస్టి, బిసి, మత మైనార్టీ, అగ్ర వర్ణాల్లో పేదలకు,మహిళలందరికీ, అందరికీ సమానంగా చూసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్, రాష్ట్ర ఈసీ గైనీ గంగాధర్ నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ అడ్వకేట్ జగన్, నిర్మల్ జిల్లా కన్వీనర్ లక్ష్మి యాదవ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కోకొండ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, జిల్లా కోశాధికారి కడ మంచి సిద్ధిరాములు, జిల్లా ఈసీ మెంబర్ భీమరి భాస్కర్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ ఆర్ బాబు, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు ఈభత్వార్ రోహిదాస్, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు నత్తి జీవన్, కామారెడ్డి మండల అధ్యక్షులు దుబ్బాక నవీన్, ఎల్లారెడ్డి టౌన్ అధ్యక్షులు మర్లు సాయి బాబా, మహిళ కార్యకర్త మల్లె కరుణ,తదితరులు పాల్గొన్నారు.