యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ ఎన్నికల అధికారి జెడ్ ఆర్ వో ప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భవనంలో విలేకరుల సమావేశం జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైన సందర్భంగా ఎన్నికల అధికారి జెడ్ ఆర్ ఓ ప్రశాంత్ జిల్లా కి విచ్చేసి ఎన్నికల అవగాహన కల్పించరని కావున యువజన కాంగ్రెస్ నాయకత్వ లక్షణాలు,రాజకీయాలో రాణించాలనుకునే ప్రతి యువతి యువకులు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసే ఒక కర్మాగారం అని ఈరోజు దేశం లో రాష్ట్రం లో ఉన్న ఎందరో గొప్ప గొప్ప నాయకులు యువజన కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. కావున మండల,అసెంబ్లీ,జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవాజ్, రాష్ట్ర నాయకులు ముద్దసీర్, అదనాన్, మెయిన్,శుభం, వినోద్, సాయి కుమార్ పాల్గొన్నారు.