కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు..

– నాంపల్లి సింగిల్విండో చైర్మన్ బీరెడ్డి సల్మాన్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు..
– పార్టీ లోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి సింగిల్విండో చైర్మన్ బీరెడ్డి సల్మాన్ రెడ్డి, డైెరేక్టర్లు చిలివెరి సత్తయ్య, పాచవేని నాగరాజు సుమారు 20 మందితో గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి  ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సింగిల్విండో చైర్మన్ బీరెడ్డి సల్మాన్ రెడ్డి, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. పార్లమెంట్  ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ ,రాయప్ప రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.