
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని పలు గ్రామాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు,వలసలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో శుక్రవారం మండలంలోని పెద్దతూండ్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 20 మంది పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు జక్కు వెంకట స్వామి,మాజీ సర్పంచ్ రాజు నాయక్,విష్ణు వర్ధన్ రెడ్డి, తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యాలీర్తలు పాల్గొన్నారు.