
– మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్
నవతెలంగాణ – బొమ్మలరామారం
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు. ప్రజలు నిరాశ చెందవద్దని, తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం మండల మర్యాల లో స్పెషల్ ఆఫీసర్, శ్రీ మాలీని సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి కాంగ్రెస్ సర్కార్ ‘రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు’ వంటి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.అర్హుల జాబితాలో రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామాంజు రెడ్డి,ఏఈఓ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు నిర్మల జ్యోతి, పలువురు నాయకులు పాల్గొన్నారు.