రైతు సమస్యలపై నిరంతర పోరాటం

నవతెలంగాణ- భిక్కనూర్
రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాసమస్యలను గ్రామాల్లో పరిష్కరించడం జరుగుతుందని, ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాలతో తిరగవలసిన అవసరం లేదని తెలిపారు. దళారీ వ్యవస్థను అంతం చేసే వరకు పోరాటం చేస్తానని, కవలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నరసింహులు, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.