– నేడు కలెక్టర్ ఆపీస్ ఎదుట ధర్నా జయప్రదం చేయండి
– 13వ రోజుకు చేరిన ఏఎన్‌ఎం సమ్మె
నవతెలంగాణ-తాండూరు
ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలని కోరుతూ కొనసాగిస్తున్న సమ్మె ఆది వారంతో 13వ రోజుకు చేరింది. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో కాంట్రాక్టు ఏఎన్‌ఎంల 13వ రోజు సమ్మె సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 1520 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ వారిని సీనియార్టీ ప్రకారంగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. జులై 31వ తేదీన సమ్మె నోటీసు కూడా ఇచ్చారని ఆగ స్టు 15 నుండి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొని నోటీస్ ఇచ్చినా ప్రభు త్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వందవైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. ఇటీవల కాలంలో మెడికల్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ అప్పుడు పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారు. ల్యాబ్ టెక్నీషి యన్ ఫార్మసిస్టులు ఏఎన్‌ఎంలు మేల్ హెల్త్ అసిస్టెంట్లను డైరెక్ట్‌గా రెగ్యులర్ చేశారు. కానీ కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలో విషయం వరకు వచ్చేసరికి పరీక్ష విధా నంపెట్టడం అన్యాయమన్నారు. పరీక్ష విధానం రద్దుచేసి యథావిధిగా రెగ్యు లర్ చేయాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఏఎన్‌ఎంల తాండూర్ డివి జన్ అధ్యక్షులు వెంకటమ్మ, ఉపాధ్యక్షులు శ్రీదేవి, వెంకటమ్మ, కోశాధికారి భార తి, ప్రధాన కార్యదర్శి మల్లమ్మ, సహాయ కార్యదర్శిలు పుష్ప, మాధవి, రోజా, వనిత, నిర్మల, వైదేవి పాల్గొన్నారు.