కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-మధిర
దేశంలో లక్షల మంది ఉద్యోగులు కనీస వేతనం లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారందరినీ పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో ఇటు రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు పరచకుంటా కొత్త హామీలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, అట్లాంటి వారిని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచకుండా, ఎన్నికల హామీలతో ప్రజలను మభ్యపెట్టి మరల అధికారం చేజెక్కించుకోవాలని చూస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో కార్మికుల హక్కుల సాధనకై అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ప్రజాపోరాటాలు నెరవేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్‌, శీలం నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తలప్రోలు రాధాకృష్ణ, ఐద్వా జిల్లా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు, హమాలీ వర్కర్స్‌, మున్సిపల్‌ కార్మికులు, ఆర్డబ్ల్యూఎస్‌ కార్మికులు, బిల్డింగ్‌ వర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.