నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగురాలైన తుమ్మరి రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన రజనీ ఎన్నికలకు ముందు గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని గోడు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి ఉద్యోగం ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రజనీకి ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. తుమరి రజనీకి తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్‌ఒసీఏ)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినట్టు తెలిపారు. ఆమెకు నెలకు రూ.50 వేల పారితోషకాన్ని చెల్లించనున్నారు.