నవతెలంగాణ-భిక్కనూర్
మా సేవలను గుర్తించండి అంటూ కాంట్రాక్టు ప్రొఫెసర్లు వినూత్న నిరసన నిర్వహించారు. మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్టు ప్రొఫెసర్లు గొడుగులు పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గుప్తా మాట్లాడుతూ మంత్రి మండలి సబ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో సుమారు 1445 మంది కాంట్రాక్టు ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని, గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం గుర్తించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 16 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ప్రొఫెసర్లు యాలాద్రి, నరసయ్య, సునిత, వైశాలి, రమాదేవి, నిరంజన్ శర్మ, శ్రీకాంత్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.