– చోద్యం చూస్తున్న ప్రభుత్వాధికారులు….
– పనికి తగ్గా వేతనం కోసం పోరాటం…
– తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.పద్మశ్రీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంట్రాక్టర్ లు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని,ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని,అసంఘటిత కార్మికులకు పనికి తగ్గా వేతనం అమలుకు పోరాటాలే శరణ్యం అని తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.పద్మశ్రీ అన్నారు. రాష్ట్రంలోని ఆల్ యూనివర్సిటీ లో పనిచేస్తున్న టైం స్కేల్,డైలీ వేజ్,ఎన్.ఎం.ఆర్ కాంటింజెంట్,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ తదితర నాన్ టీచింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని,రిటైర్డ్ అయిన సిబ్బందికి రూ.7 లక్షలు 50 వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.పద్మశ్రీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో అమీర్ అధ్యక్షతన తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ విస్తృత సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నిర్వహణలో కీలకపాత్ర పోషించే నాన్ టీచింగ్ సిబ్బంది కృషి చాలా కీలకమని కానీ వీరి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు.క నీస వేతనాలు అందించడంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు.గత ప్రభుత్వం హయంలో ఏజెన్సీల ద్వారానే నియామకాలు జరిగాయని,ఆ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని,కానీ యూనివర్సిటీలో నిర్ణయించిన కనీస వేతన లు అతి తక్కువగా ఉండగా అందులోను ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే పర్సెంటేజీలు తీసుకుంటూనే కార్మికుల జీతాల లో కూడా భారీ కోత విధిస్తున్నారని అన్నారు. యూనివర్సిటీల పరిధిలో 8 గంటల పని విధానం అమలు చేయకుండా 10 గంటల పని విధానం అమల్లో ఉన్నదని, పని భారం తీవ్రంగా నాన్ టీచింగ్ సిబ్బందిపై ఉందని అన్నారు.కనీసం రూ. 26 వేల రూపాయలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, జీవో 16 ప్రకారం యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను యూనివర్సిటీలో పనిచేస్తున్న టైం స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తో భర్తీ చేయాలని,కాంట్రాక్ట్ మారితే సిబ్బందిని తొలగించే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ మానుకోవాలని,ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, యూనివర్సిటీ నాయకులు సాలార్, రమేష్, రమణ, తిరుపతి రెడ్డి, షకీర్, ఆశ,అనిత తదితరులు పాల్గొన్నారు.